కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోన్న చిరుత సంచారం

కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోన్న చిరుత సంచారం
x
Highlights

కర్నూలు జిల్లాలో చిరుత పంజా విసిరింది. పత్తికొండ మండలం అటవీ శివారులో మూగజీవాలపై దాడిచేసి చంపేసింది. చిరుత సంచారంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు....

కర్నూలు జిల్లాలో చిరుత పంజా విసిరింది. పత్తికొండ మండలం అటవీ శివారులో మూగజీవాలపై దాడిచేసి చంపేసింది. చిరుత సంచారంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తోందని స్థానికులు వాపోతున్నారు. హోసూరు, పెద్దహుల్తీ గ్రామాల మధ్య చిరుత తిరుగుతుందని పొలాలకు వెళ్లాలంటే భయమేస్తుందని స్ధానికులు చెబుతున్నారు.

దీంతో స్థానికులు రాత్రంతా కట్టెలు, కొడవళ్లతో అడవిలో తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. పశువులపై దాడులు చేస్తున్న చిరుతను గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్ధులు అధికారులను కోరుతున్నారు. ఇరు గ్రామాల మధ్య తిరిగినట్లుగా చిరుత అడుగు జాడలు కనిపించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. స్థానికుల సమాచారంతో చిరుత సంచారం వేసిన ప్రాంతాలన్నింటిని పరిశీలించి వాటి పాదముద్రలను సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు త్వరలోనే చిరుతను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories