విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌..అన్నల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌..అన్నల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
x
Highlights

విశాఖ మన్యం గజ గజ వణికుతోంది. భయంకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా సాగుతోన్న కూంబింగ్‌ మరోవైపు మావోయిస్టు వారోత్సవాలతో గరిజనం...

విశాఖ మన్యం గజ గజ వణికుతోంది. భయంకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా సాగుతోన్న కూంబింగ్‌ మరోవైపు మావోయిస్టు వారోత్సవాలతో గరిజనం అల్లాడిపోతున్నారు. మావోలు, పోలీసుల వార్ తో ఏజెన్సీ గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. బూటు చప్పుళ్లు తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు.

ఏవోబీ కీకారణ్యంలో మావోయిస్టుల వేట మొదలైంది. ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ యుద్ధ వాతావరణం అలుముకుంది. మావోయిస్టులను హతమార్చిన ఘటనతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. మావోయిస్టులపై పక్కా వ్యూహరచనతో అడుగులు వేసి హతం చేశారు. దీంతో సైలెంట్‌గా ఉన్న మన్యంలో రక్తపుటేరులు పారాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరుగుతున్న వార్ తో ఆంద్రా, ఒరిస్సా సరిహద్దు వణికిపోతుంది.

గూడెం కొత్తవీధి మండలం మదిమల్లు కొండ జర్త ఈస్ట్‌ దగ్గర భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. మావోల వారోత్సవాలు జరుగుతున్న టైంలో కాల్పులు జరగడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మవోల దగ్గర నుంచి తుపాకులు. ల్యాండ్‌మైన్లను స్వాధినం చేసుకున్నారు. మవోల కోసం గ్రౌహౌండ్స్‌ దళాలు, స్పెసల్‌ పార్టీలు, సీఆర్సీఎఫ్‌ దళాలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు మావోలకు వ్యతిరేకంగా గిరిజన విద్యార్ధి పేరిట వాల్‌పోస్టర్లు వెలియడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ వారోత్సవాలు వద్దు అభివృద్ధి ముద్దు అని రాసి ఉన్నాయి. గతంలో మావోయిస్టులు పేల్చేసిన సెల్‌టవర్లు, బీభత్సం సృష్టించిన ఫోటోలను ముద్రించి అతికించారు. ఎన్ కౌంటర్ తర్వాత ఏవోబి నివురు గప్పిన నిప్పులా మారింది. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో హైఎలర్ట్ ప్రకటించారు. అన్నల ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మన్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మారుమూల గిరిజన పల్లెల్లో అలజడి రేగుతోంది.

సరిహద్దులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులెవరైనా కనిపిస్తే విచారించి కానీ వదిలి పెట్టడం లేదు. ఏజెన్సీ గ్రామాలలో మావోయిస్టుల కోసం ఇల్లిల్లూ తిరిగి వెతుకుతున్నారు అన్నల ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలు పోలీసులు, మావోయిస్టుల చర్యలతో భయంతో వణికిపోతున్నాయ్ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు గిరిజిన గ్రామాల ప్రజలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories