వైజాగ్ ఎయిర్పోర్ట్.. రాజకీయాలకు కంఫర్ట్ !

వైజాగ్ ఎయిర్పోర్ట్.. రాజకీయాలకు కంఫర్ట్ !
x
Highlights

విశాఖ ఎయిర్ పోర్ట్ రాను రాను రాష్ట్ర రాజకీయల కీలక పరిణామాలకు వేదికగా మారుతోంది. నాటి ప్రతిపక్ష నేత జగన్ రన్ వే గొడవ నుంచి నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు...

విశాఖ ఎయిర్ పోర్ట్ రాను రాను రాష్ట్ర రాజకీయల కీలక పరిణామాలకు వేదికగా మారుతోంది. నాటి ప్రతిపక్ష నేత జగన్ రన్ వే గొడవ నుంచి నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్బంధం వరకు వైజాగ్ విమానాశ్రయంలోనే చోటు చేసుకున్నాయి. అసలు విశాఖ ఎయిర్ పోర్ట్ పోలిటికల్ స్టంట్స్ కు ఎందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడాలి.

సైనిక కార్యకలాపాలకే కాదు పోలిటికల్ ఇష్యూలకు కూడా విశాఖపట్నం విమానాశ్రయం కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. మూడేళ్ల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదా లో ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా నిరసన కోసం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు, అనుమతి లేదంటూ పోలిసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై జగన్ రన్ వే పై బైటాయించి నిరసన తెలిపారు.

గత సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన జగన్ పై ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష‌్టించింది. కోడికత్తి దాడిపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రెండు నెలల క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబు భూ కబ్జాల పై నిరసనగా ధర్నా కోసం విశాఖ వచ్చేందుకు ప్రయత్నించగా, విమానాశ్రయంలోనే వైసీపీ శ్రేణులు అడ్డుకుని సుమారు 6 గంటల పాటు దిగ్భందం చేశాయి. దీంతో చంద్రబాబు ఎయిర్ పోర్ట్ నుండే వెనుతిరిగారు.

కరోనా లాక్ డౌన్ లో రెండు నెలల తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చేందుకు చంద్రబాబు అనుమతి కోరగా, పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, చంద్రబాబు రాకను విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే ఏదో విధంగా అడ్డుకుంటారనే గుసగుసలు వినిపించాయి. ఆ అనుమానాలు నిజమైనట్టుగా ఏకంగా విమానమే రద్దైంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కావాలనే ఇలా చేశారని ధ్వజమెత్తుతున్నారు.

గత మూడేళ్లలో అధికార, ప్రతిపక్ష నేతలకు సంబంధించి కీలక ఘట్టాలన్నీ విశాఖ విమానాశ్రయంలోనే జరుగుతున్నాయి. ఇవన్ని యాదృఛికమే అయినా రాజకీయ ప్రంకపనలు సృష్టించాయి. ఓడిన చోటే గెలవాలన్నట్లు వైసీపీ, టీడిపి నేతల మధ్య టిట్ ఫర్ టాట్ నడుస్తుందన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories