ఎన్టీఆర్ నుంచి ఎస్వీఆర్‌లాగా మారాను : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎన్టీఆర్ నుంచి ఎస్వీఆర్‌లాగా మారాను : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
x
Highlights

ప్రస్తుతం ప్రజలకు దూరం అయ్యానని, అయినా గౌరవపదమైన పదవిలో ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన గుంటూరు క్లబ్ లో ఆత్మీయ...

ప్రస్తుతం ప్రజలకు దూరం అయ్యానని, అయినా గౌరవపదమైన పదవిలో ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన గుంటూరు క్లబ్ లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తానూ ఉపరాష్ట్రపతి గా వెళ్ళినపుడు రకరకాలుగా మాట్లాడారనీ, ఎవరి అభిప్రాయాలు వారివనీ చెప్పారు. తాను ఎన్టీఆర్ నుంచి ఎస్వీఆర్‌లాగా మారానని అన్నారు. 70 ఏళ్ళకు రాజకీయాలను వదిలేసి సమాజ సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ 42 ఏళ్ల తర్వాత తొలిసారిగా తాను లేకుండా ఎన్నికలు జరిగాయని వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో సుమారు రోజుకు 16 సభలలో పాల్గోనే వాడినని, ఉపరాష్ట్రపతిగా కూడా తన వంతు ప్రజా సేవకు కృషి చేస్తున్ననని వెంకయ్య నాయుడు అన్నారు.

నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధకరమని, రాజకీయ నేతల భాష అసభ్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే తాను ఎన్నికలలో పోటీ చేసేవాడినని, నేటి ఎన్నికలలో కోటానుకోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇంత ఖర్చు పెట్టి మనం ప్రజలకు ఏం న్యాయం చేస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజా స్వామ్య వ్యవస్థను అవహేలన చేస్తున్నారని, రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపీకలో గుణగణాలు చూడాలన్నారు. ఇవాళ కులం, మతం, ధనమే చూస్తున్నారని విమర్శించారు. ఉచిత పధకాలకు తాను వ్యతిరేకమని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకే మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మంచి అంశాలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాను మొదటి నుంచి కమ్యూనిజం అంటే వ్యతిరేకమని చెప్పారు. కానీ వామపక్ష నాయకులకు ఎనలేని గౌరవం ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories