నా చిన్ననాటి కల నెరవేరింది : వెంకయ్యనాయుడు

నా చిన్ననాటి కల నెరవేరింది : వెంకయ్యనాయుడు
x
Highlights

అదో గ్రామం. చుట్టూ కొండలూ, గుట్టలూ. ఆ పర్వతాల మధ్య నుంచి రైలు వెళుతుంటే చూడాలని ఓ బాలుడు కలగన్నాడు. పెరిగి పెద్దయ్యాక పెద్ద హోదాలోకి వచ్చారు. తన...

అదో గ్రామం. చుట్టూ కొండలూ, గుట్టలూ. ఆ పర్వతాల మధ్య నుంచి రైలు వెళుతుంటే చూడాలని ఓ బాలుడు కలగన్నాడు. పెరిగి పెద్దయ్యాక పెద్ద హోదాలోకి వచ్చారు. తన చిన్ననాటి కలను నిజం చేసుకునేందుకు తన వంతు కృషి చేశారు. ఆ కల అద్భుత ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకొంది. చివరకు అతడి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, కలగన్న ఆ బాలుడు ఎవరో చూడండి.

నెల్లూరు జిల్లాలో 1993 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరిశీలించారు. చెర్లోపల్లి వద్ద వెలిగొండ కొండల్లో నిర్మించిన ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల సొరంగమార్గాన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ మార్గంలో ప్రత్కేక రైలులో వెంకటాచలం నుంచి కడప జిల్లా చిట్వేలణ మండలం చెర్లోపల్లె రైల్వేస్టేషన్ చేరుకున్నారు.

చెర్లోపల్లె ఏర్పాటు చేసిన సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశంలోని అతి పొడవైన అధునాతన సొరంగమార్గం ఇదేనన్నారు. ఈ ప్రయాణం ద్వారా ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మధ్య 5 గంటల సమయం తగ్గుతుందన్నారు. తన సొంతూరు వెంకటాచలంలో రైలును చూడాలనే తన చిన్ననాటి కల నెరవేరిందని వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ మార్గాన్ని ప్రారభించారు. కేవలం 43 నెలల్లోనే ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా, అధునాతన సౌకర్యాలతో, స్టేషన్ల నిర్మాణానికి కృషి చేసిన కాంట్రాక్టర్లు, రైల్వే సిబ్బంది, కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వెంకయ్యనాయుడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories