Top
logo

మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది : వర్ల రామయ్య

మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది : వర్ల రామయ్య
X
Highlights

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి సీఎం జగన్‌ను, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత...

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి సీఎం జగన్‌ను, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనలు అంటూ జూమ్ లో రోజూ ఊదరగొట్టారని, ఏడాది పాలన పై జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. రావట్లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. దీనికి కౌంటర్ ఇస్తూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

''విజయసాయిరెడ్డి గారు! మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది. ఇక, ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు, మీకు గుండెలాగిపోవు? హాస్యానికయినా హద్దుండాలి... కొండ నాలుకకు మందు వేస్తే, వున్న నాలుక పోయిందట మీలాంటి వానికి. తస్మాత్ జాగ్రత్త'' అని వర్ల రామయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.




Web TitleVarla Ramaiah strong counter to YSRCP leaders over twitter
Next Story