జనసేనానితో రాధా.. ఏంటి సంగతి?

జనసేనానితో రాధా.. ఏంటి సంగతి?
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జనసేన మేధో మథనం మొదలు పెట్టింది. జనసేన అదినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయాత్నాలు మొదలు పెట్టారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జనసేన మేధో మథనం మొదలు పెట్టింది. జనసేన అదినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయాత్నాలు మొదలు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిండి రిసార్ట్స్ లో పార్టీ ముఖ్యనేతలతో మేథో మథన సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్ పోర్టు కు చేరుకున్న జనసేనానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఇవాళ అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్ వివిధ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. డిండి రిసార్ట్స్ లో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తున్న జనసేనానిని కలువడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మర్యాద పూర్వకంగా కలిశారా.. లేక జనసేనలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారా అన్నది జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఆరంభం వరకు వైసీపీలో ఉన్న రాధా.. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడాయన చూపు జనసేనపై పడిందా? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది.

ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి వంగవీటి రాధా రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్తో భేటీతో ఈ ప్రచారం నిజమే అని అర్థమవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ను కలడం చూస్తుంటే జనసేనాలో చేరేందుకు సిద్ధమైనట్లుగా భావించాల్సి వస్తోంది. మరో వైపు ఏపీపై కన్నేసిన బీజేపీలోకి పలువురు చేరుతుండగా..పార్టీ బలోపేతం వైపు అడుగులు వేస్తున్న పవన్ వెంట ఎవరెవరు నడిచి వస్తారో వేస్తారో అన్నది ఆసక్తికరంగా మారుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories