ఏపీలో మందుబాబులకి కొత్త రూల్... మాస్క్ తో పాటు అది కూడా తప్పనిసరి!

ఏపీలో మందుబాబులకి కొత్త రూల్... మాస్క్ తో పాటు అది కూడా తప్పనిసరి!
x
Highlights

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది. దీనితో ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో మద్యం షాపులు గత సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ధరలు పెంచినప్పటికి మందుబాబులు మాత్రం దుకాణాలు వద్ద భారీ క్యూలు కడుతున్నారు. ఎండలను సైతం లెక్క చేయడం లేదు.

కనీసం ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సైతం పాటించడం లేదు.. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్ లు ధరించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి టైంలో మధ్యంబాబులకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. భౌతిక దూరం, మాస్క్ లతో పాటు గొడుగు కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. అది ఉంటనే మద్యం ఇస్తామని ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు నిబంధన పెట్టారు.

విశాఖకు చెందిన డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు గొడుగు సిద్ధాంతాన్ని సూచించారట. గొడుగు వాడడం వలన ఆటోమేటిక్ గా భౌతిక దూరం కచ్చితంగా పెరుగుతుందని, తోపులాట కూడా తగ్గుతుందని అంచనా వేశారట.. అందుకే ఈ నిబంధనను అమలులోకి తెచ్చామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు...ఇక ఇప్పటికే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఈ రూల్ అమల్లో ఉంది. దీంతో గొడుగులకు ఇప్పడు భారీ డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా పలు మద్యం షాపులు వద్ద రూ.10 నుంచి రూ.20 లకి గొడుగును అద్దెకి ఇస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories