ఆంజనేయ వాహనంలో ఉపమాక వెంకన్న తిరువీధి సేవ

ఆంజనేయ వాహనంలో ఉపమాక వెంకన్న తిరువీధి సేవ
x
Highlights

మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆంజనేయ వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను తిరువీధి సేవ నిర్వహించారు.

నక్కపల్లి: మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆంజనేయ వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను తిరువీధి సేవ నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా కొండపై గల స్వామి వారి మూలవిరాట్ కు అర్చకుడు కృష్ణమాచార్యులు అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కొండ దిగువున గల క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, ఉభయ దేవేరులతో కూడిన స్వామి వారి ఉత్సవమూర్తులకు అర్చకుడు ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం తిరువారాధనలు, ప్రసాదనివేదనలు, నిత్యహోమాలు, బలిహరణలు, తీర్థగోష్ఠి పూర్తి చేసిన తరువాత తిరువీధి సేవ నిర్వహించగా గ్రామస్థులు దర్శించుకున్నారు. తరువాత ఆండాళ్ సన్నిధిలో ప్రత్యేకంగా నీరాజన మంత్రపుష్పాలు, తీర్థగోష్ఠి, ప్రసాద వినియోగం గావించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎన్.హరిబాబు, టిటిడీ విజిలెన్స్ కు చెందిన రాజశేఖర్, గ్రామస్థులు,పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories