జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్...ప్రధాని మోదీని ఏపీ సీఎం అడిగిన వెంటనే!

జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్...ప్రధాని మోదీని ఏపీ సీఎం అడిగిన వెంటనే!
x
YSJagan(file photo)
Highlights

ఆంధ్ర ప్రదేశ్ జగన్ సర్కారుకు కేంద్రం తియ్యటి కబుతు చెప్పింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీని కరోనా దెబ్బకు కష్టాల్లో ఉన్నామని, కేంద్ర ఆదుకోవాలని కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ జగన్ సర్కారుకు కేంద్రం తియ్యటి కబుతు చెప్పింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీని కరోనా దెబ్బకు కష్టాల్లో ఉన్నామని, కేంద్ర ఆదుకోవాలని కోరారు.ఆ మరుసటి రోజే కేంద్రం ఈ నిధులకు విడుదల చేసింది.

రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లను రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు ఈ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి కేంద్రం ఈ విధంగా నిధులను విడుదల చేయడం అంటే రాష్ట్రానికి మేలు చేయడం అన్నట్టే చెప్పుకోవాలి.

15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసింది. కాగా రూ.491.41 కోట్లను ఏప్రిల్‌ నెలకు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్‌ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. కాగా అందులో రూ.1,119 కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. దీంతో రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా విడుదల చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories