తిరుమలలో నేటి నుంచి కొత్త లడ్డూ విధానం.. ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ

తిరుమలలో నేటి నుంచి కొత్త లడ్డూ విధానం.. ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ
x
తిరుమలలో నేటి నుంచి కొత్త లడ్డూ విధానం
Highlights

తిరుమల తిరుపతి అంటే మొదట గుర్తుకు వచ్చేది లడ్డూ. అక్కడ శ్రీవారి దర్శనం కోసం ఎంత కష్టపడాలో స్వామి ప్రసాదం లడ్డూ కోసం కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది....

తిరుమల తిరుపతి అంటే మొదట గుర్తుకు వచ్చేది లడ్డూ. అక్కడ శ్రీవారి దర్శనం కోసం ఎంత కష్టపడాలో స్వామి ప్రసాదం లడ్డూ కోసం కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీటీడీ కొన్ని రోజుల కిందట భక్తుల కష్టాలు తీర్చే తియ్యటి కబురు చెప్పింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడుకి లడ్డూల కొరత లేకుండా చూడటమే కాకుండా ఫ్రీగా లడ్డూ ఇస్తామని ప్రకటించింది. ఇది ఇవాళ్టి నుంచి అమలుల్లోకి రానుంది. రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం స్వస్తి పలికింది. అదనపు లడ్డూ కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

తిరుమలలో రాయితీ లడ్డూ విధానానికి నేటితో స్వస్తి చెప్పనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. లడ్డూ ప్రసాదం పంపిణీలో ఈ రోజు నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ అందిస్తామని తెలిపారు. అంతేకాదు ఒకటికి మించి ప్రతీ అదనపు లడ్డూ కోసం 50 రూపాయల చొప్పున చెల్లించాలని ఆయన వెల్లడించారు. రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక ఇప్పటి నుంచి భక్తులు స్వామి ప్రసాదం కోసం కష్టపడనక్కర్లేదు. కానీ అదనపు లడ్డూ కావాలంటే మాత్రం 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక1990 ముందు వరకు ఎన్ని లడ్డూ ప్రసాదాలు కావాలంటే అన్ని ఇచ్చేవారు. కానీ, ఆ తర్వాత రద్దీ పెరగడంతో లడ్డూ ప్రసాదంలో మార్పులు తీసుకొచ్చారు. పరిమితి మేరకు మాత్రమే ప్రసాదం అందజేస్తూ వచ్చారు. లడ్డూలను తిరుమల గర్భాలయానికి శ్రీవారి పోటుకు మధ్యలో వకుళామాత విగ్రహాన్ని నెలకొల్పారు. పోటులో తయారు చేసిన లడ్డూ, వడలు, వనియారాలు వగైరా వంటి వాటిని వకుళామాతకు సమర్పించి అనంతరం శ్రీవారికి సమర్పించేవారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories