కాసేపట్లో టీటీడీ బోర్డు ప్రకటన..బోర్డు సభ్యులుగా వినిపిస్తోన్న పేర్లు..

కాసేపట్లో టీటీడీ బోర్డు ప్రకటన..బోర్డు సభ్యులుగా వినిపిస్తోన్న పేర్లు..
x
Highlights

ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు నియామకానికి కసరత్తు పూర్తయింది. బోర్డు సభ్యులను దాదాపు ఫైనలైజ్ చేశారు. ఏపీ నేతలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు...

ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు నియామకానికి కసరత్తు పూర్తయింది. బోర్డు సభ్యులను దాదాపు ఫైనలైజ్ చేశారు. ఏపీ నేతలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు బోర్డులో ఉండబోతున్నారు. అలాగే కేంద్ర పెద్దల సిఫార్సుల మేరకు మరికొందరు వీఐపీలకు టీటీడీ బోర్డులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

టీటీడీ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటోన్న సీఎం జగన్‌... బోర్డు సభ్యుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించడంతో సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, వైసీపీ సీనియర్ నేతలతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు టీటీడీ బోర్డులో ఈసారి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి టీటీడీ బోర్డులో 25మంది సభ్యులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించినట్లు సమాచారం అందుతోంది. వీరిలో యలమంచిలి కన్నబాబు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌‌రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతి పేరు ఫైనలైందంటున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు.

ఇక తిరుమల తిరుపతి దేశస్థానానికి దేశవ్యాప్తంగా పేరుండటంతో జాతీయ స్థాయిలో సిఫార్సులు వచ్చాయి. కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు మొత్తం ఆరుగులు మంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినీరంగం నుంచి కూడా పెద్దఎత్తున సిఫార్పులు వచ్చాయి. అయితే, అందులో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories