Top
logo

Andhra Pradesh: టీటీడీ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ గదుల బుకింగ్ లో మార్పులు

Andhra Pradesh: టీటీడీ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ గదుల బుకింగ్ లో మార్పులు
Highlights

కలియుగ దైవం తిరుపతి వెంకన్న సన్నిధికి ప్రతిరోజూ లక్షల్లో భక్తులు చేరుకుంటారు.

కలియుగ దైవం తిరుపతి వెంకన్న సన్నిధికి ప్రతిరోజూ లక్షల్లో భక్తులు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్నేళ్లుగా అతి తక్కువ అద్దెకు గదులను కేటాయిస్తుంది. ఇదిలా ఉంటే చాలా మంది భక్తులు ఆన్‌లైన్‌లో గదులను బుక్ చేసుకుని ఆ గదులలో ఉండకపోవడంతో, ఆ రూమ్ లు ఖాళీగా ఉండిపోతున్నాయి. దీంతో నేరుగా గదుల కోసం క్యూలో నిలుచునే భక్తులకు గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేకమైన రోజుల్లో, రద్దీ ఉన్న సమయంలో గదుల సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీటీడీ ఆన్ లైన్ లో గదులను బుక్ చేసుకునే విధానంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. భక్తులు కొండపై గదులను బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాషన్ డిపాజిట్ చెల్లించే పద్ధతిని తీసుకొచ్చింది. గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సమయంలోనే ఈ డిపాజిట్ ని చెల్లించాలనే నిబంధనలు పెట్టింది. తిరిగి భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తారని తెలిపింది. ఈ విధానాన్ని ఈ నెల చివరి నాటికి అమలు చేయనున్నారు.

ఇకపోతే టీటీడీ ప్రవేశపెట్టిన ఈ పద్ధతుల్లో కొన్ని సవాళ్లు ఎదరవుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు టీటీడీ అధికారులు ఫోకస్ పెట్టారని తెలుపుతున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆన్ లైన్ లో గదులను బుకింగ్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తారని, డిపాజిట్ నిబంధన కచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.


Web TitleTTD make changes for online rooms booking

లైవ్ టీవి


Share it
Top