కరోనాపై పోరాటం : టీటీడి భారీ విరాళం

కరోనాపై పోరాటం : టీటీడి భారీ విరాళం
x
TTD (File Photo)
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయనాయకులు, సినీతారలు, క్రీడాకారులు, స్వచ్చంధ సంస్థల నేతలు ముందుకు వచ్చి బాసటగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీటీడీ రూ. 19కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు టీటీడీ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఇప్పటికే రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో రూ.11కోట్లను త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామని సింఘాల్ తెలిపారు.

కరోనాని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో చాలా మంది నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి టీటీడీ అండగా నిలుస్తుంది. వలస కూలీలతో పాటు యాచకులను ఆదుకునేందుకు రోజుకు లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ అధికారులు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకు తాము భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తామని టీటీడీ వెల్లడించింది. ఇక కరోనా వైరస్ ప్రభావంతో తిరుమలలో దర్శనాలు ఆపేశారు. కానీ స్వామి వారికి నిత్యం పూజలు జరుగుతున్నాయని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అంతేకాకుండా తిరుమలపై వస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని అయన కోరారు..

ఇక ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories