పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి

పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి
x
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమైంది. గత ఏడాది కంటే బడ్జెట్‌ 66 కోట్లకు పెరిగింది. బూందిపోటులో అగ్ని ప్రమాదాల నివారణకు 3కోట్ల 30 లక్షలు, జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

34కోట్లతో ఎస్వీ బధిర పాఠశాల హాస్టల్‌ నిర్మాణానికి నిర్ణయించారు. బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు 8కోట్ల 50క్షలు, చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3కోట్ల 90 లక్షలు కేటాయించారు. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ టీటీడీ టెంపుల్‌ దగ్గర పుష్కరిణి, కళ్యాణ మండపం, వాహన మండపం నిర్మాణానికి పాలక మండలి ఆమోదించింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు టీటీడీ అనుబంధంగా సైబర్‌ క్రైమ్‌ విభాగం ఏర్పాటుకు నిర్ణయించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాల సమయంలో మార్పుపై అధ్యయనం చేయనున్నట్లు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories