పదవీవిరమణ పొందిన అధికారులకు సువర్ణ అవకాశం‌ కల్పించిన టీటీడీ

పదవీవిరమణ పొందిన అధికారులకు సువర్ణ అవకాశం‌ కల్పించిన టీటీడీ
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేయడమంటే జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు... శ్రీవారి కొలువులో విధులు నిర్వహించే భాగ్యం అందరికీ దొరకదు, దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల పాటు స్వామివారి సేవలో పాల్గొని, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు టీటీడీ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

(తిరుమల నుంచి హెచ్ ఎం టీ వీ ప్రతినిధి శ్యామ్ కే నాయుడు)

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేయడమంటే జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు... శ్రీవారి కొలువులో విధులు నిర్వహించే భాగ్యం అందరికీ దొరకదు, దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల పాటు స్వామివారి సేవలో పాల్గొని, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు టీటీడీ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. టిటిడి తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తో విశ్రాంత ఉద్యోగులకు మహదవకాశం లభించిందనే చెప్పాలి.

టీటీడీ తాజా నిర్ణయం ప్రకారం శ్రీవారి ఆలయంలో, భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో యాత్రికుల సంక్షేమ సౌకర్య సేవ కోసం గానూ రిటైర్డ్ అయిన 10 మంది అనుభవజ్ఞులైన టీటీడీ అధికారులకు బాధ్యతలు అప్పచేబుతున్నారు. వీరిలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో క్యాడర్ లో రిటైరైన అధికారి ఒకరికి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాడర్ లో రిటైరైన ముగ్గురికి, సూపరింటెండెంట్ క్యాడర్ లో పదవీవిరమణ పొందిన ఆరు మందికి మొత్తంగా పదిమంది రిటైరైన అధికారులకు ఈ అవకాశం లభించింది.

ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా తొలుత వీరికి శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉద్యోగ బాధ్యతలు అప్పజెప్పాలని, గౌరవ వేతనం చెల్లించి వీరి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులను టీటీడీ కార్య నిర్వహణాధికారి జారీ చేశారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories