శ్రీవారి ఆస్తుల పై శ్వేత పత్రం..బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశం!

శ్రీవారి ఆస్తుల పై శ్వేత పత్రం..బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశం!
x
YV Subbareddy (File Photo)
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం భూముల వేలం వ్యవహారంలో వచ్చిన వ్యతిరేకత బోర్డు పై బాగానే పనిచేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం భూముల వేలం వ్యవహారంలో వచ్చిన వ్యతిరేకత బోర్డు పై బాగానే పనిచేసింది. ఇప్పటివరకూ ఉన్న శ్రీవారి ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులకు శ్వేత పత్రం సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. టీటీడీకి చెందిన ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదని ఈ సందర్భంగా అయన అధికారులకు చెప్పారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణ కు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేత పత్రంలో ఉండాలని ఆదేశించారు.

దురాక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడమా , లేక కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ కావడమో జరగాలన్నారు. 2016 లో ఆస్తుల విక్రయానికి గత ప్రభుత్వం నియమించిన బోర్డు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తుల అమ్మకం ప్రక్రియకు సంబంధించి వివిధ దశల్లో ఎక్కడ ఏం జరిగిందో తేల్చేందుకు సమగ్ర విచారణకు కోరుతూ ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో టీటీడీ ఆస్తులు కొన్ని అన్యాక్రాంతం అవుతున్నందున వేలం వేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శ్రీవారికి చెందిన ఏ ఆస్తినీ అమ్మవద్దని బోర్డును ఆదేశించింది. దీంతో తాము ఆ నిర్ణయాన్ని తీసుకోలేదంటూ బోర్డు చెప్పుకొచ్చింది. ఈ విషయంలో విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి కూడా బోర్డు చర్యలను తప్పు పట్టారు. భక్తుల మనోభావాలను కించ పరచవద్దని చెప్పారు. అదే సమయంలో టీటీడీ ఆస్తుల వ్యవహారంలో ఒక శేవత పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తే మంచిదని స్వామి సూచించారనీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు టీటీడీ ఈ నిర్ణయం వెనుక స్వామి సలహా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories