నటుడు నాగబాబుపైన కేసు నమోదు!

నటుడు నాగబాబుపైన కేసు నమోదు!
x
Actor Nagababu(File photo)
Highlights

సినీ నటుడు, జనసేన లీడర్ నాగబాబుపైన కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగబాబు తాజాగా మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా పలు కీలక వాఖ్యలు చేశారు.

సినీ నటుడు, జనసేన లీడర్ నాగబాబుపైన కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగబాబు తాజాగా మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా పలు కీలక వాఖ్యలు చేశారు. గాడ్సేను నిజమైన దేశభక్తుడని అంటూ ఓ ట్వీట్ చేశారు. " ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది డిబేట్ .. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

నాగబాబు చేసిన ఈ వాఖ్యాలపైన నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే నాగబాబుపై ఉస్మానియా యూనివర్సీటీ (ఓయూ) పోలీస్ స్టేషన్‌లో టీపీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నటుడు నాగబాబుకు మతి భ్రమించిందని, అయన మానసిక పరిస్థితి బాగాలేనందునే ట్విట్టర్‌లో జాతిపిత గాంధీని చంపిన నాథూరాం గాడ్సే‌ను దేశభక్తుడని అన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాఖ్యలు చేసిన నాగబాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అయన కోరారు.

ఇక నాగబాబు మరో ట్వీట్ చేశారు. " దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం." అంటూ నాగబాబు మరో ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories