భక్తులకు షాకిచ్చిన టీటీడీ

భక్తులకు షాకిచ్చిన టీటీడీ
x
Highlights

తిరుపతి లడ్డూ అంటే ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పని లేదు.

తిరుపతి లడ్డూ అంటే ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పని లేదు. తిరుపతి వెళ్లి వస్తే..ఇంటికి వచ్చాక చుట్టాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు తిరుపతి లడ్డూ పంచందే.. తృప్తి ఉండదు. ఒకవేళ లడ్డూ ప్రసాదం పెట్టకపోతే... తిరుపతి వెళ్లొచ్చారు.. కనీసం ప్రసాదం పెట్టరా అని అడిగి మరీ తీసుకుంటారు. పెట్టిన కాస్త ప్రసాదమైనా కళ్లకు అద్దుకుని తామే తిరుపతి వెళ్లి వచ్చినంతగా భావిస్తారు భక్తులు. మరి అంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుపతి లడ్డూ ఇప్పుడు భక్తులకు భారంగా మారనుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం మాటున వాత పెట్టనుంది.

తిరుమల శ్రీవారి లడ్డూపై ఇప్పటిదాకా టీటీడీ ఇస్తున్నరాయితీని ఎత్తివేయడంతో భక్తులకు మరింత ప్రియమైంది. ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చే పథకం మాటున అదనం చేసేందుకు రంగం సిద్ధంమైంది. ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ ఇప్పుడు అన్ని కేటగిరీల భక్తులకూ ఇవ్వాలని నిర్ణయించారు. ఉచితంగా ఒక లడ్డూ ఇస్తునే అన్ని రాయితీలు రద్దు చేసే ఆలోచన ఉన్నట్లు వస్తున్న వార్తలను పాలకమండలి ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ఖండించిన కొద్ది రోజులకే నూతన విధానం అమలుకు సిద్ధమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఈ నెల 20 నుంచి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పిన ఆయన అదనంగా కావాంటే...ఒక్కొక్కటి 50రూపాయాల చొప్పున కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అడ్డూలపై రాయితీలు ఇకపై లేనట్టేనని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories