మూడు రాజధానుల బిల్లు: జగన్ సర్కార్ ముందు మూడు ఆప్షన్లు

మూడు రాజధానుల బిల్లు: జగన్ సర్కార్ ముందు మూడు ఆప్షన్లు
x
మూడు రాజధానుల బిల్లు: జగన్ సర్కార్ ముందు మూడు ఆప్షన్లు
Highlights

మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆగిపోయింది. బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లనుంది. మండలిలో బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా.. టీడీపీ సభలో ఉన్న బలంతో అడ్డుకుంది.

మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆగిపోయింది. బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లనుంది. మండలిలో బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా.. టీడీపీ సభలో ఉన్న బలంతో అడ్డుకుంది. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఫోకస్ పెట్టింది. న్యాయ నిపుణులతో చర్చిస్తోంది ఎలా అడుగులు ముందుకు వేస్తే మంచిదనే అభిప్రాయాలు తీసుకుంటోంది.

ఇప్పుడు ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మొదటిది ఆర్డినెన్స్ తీసుకురావడం.. రెండోది శాసనమండలిని రద్దు చేయడం.. మూడోది సెలక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు వేచి ఉండటం. ముందు ఆర్డినెన్స్ విషయానికి వస్తే ఆర్డినెన్స్ తేవాలంటే ముందు అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. కానీ బిల్లు సజీవంగా ఉంచడంతో ఆ ఆప్షన్ కష్టమే అంతేకాదు న్యాయపరమైన చిక్కులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రిస్క్ తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.

ఇక ప్రభుత్వం ముందు ఉన్న రెండో ఆప్షన్ శాసనమండలి రద్దు. రెండు రోజులుగా ఇదే చర్చ జరిగింది. ప్రభుత్వం మండలిని రద్దు చేస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే మండలి రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి శాసనమండలి రద్దుకు ఏడాది సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మూడో ఆప్షన్ విషయానికి వస్తే సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ప్రభుత్వం వేడి చూడటం. కమిటీ రిపోర్ట్ రావాలంటే మూడు నెలల సమయం పడుతుంది. రిపోర్ట్ వచ్చాక అసెంబ్లీకి మళ్లీ బిల్లు వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ప్రభుత్వం ఈ మూడు ఆప్షన్లపై ప్రధానంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories