భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అతిచిన్న దూడ

భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి   అతిచిన్న దూడ
x
Highlights

బ్రహ్మంగారు చెప్పిన విధంగా సమాజంలో చాలా వింతలు జరుగుతున్నాయి. చిన్న చిన్న చెట్లకు నిచ్చెనలు వేసే మనుషులు పుడతారని బ్రహ్మంగారు చెప్పారు. అది ఎంత వరకు...

బ్రహ్మంగారు చెప్పిన విధంగా సమాజంలో చాలా వింతలు జరుగుతున్నాయి. చిన్న చిన్న చెట్లకు నిచ్చెనలు వేసే మనుషులు పుడతారని బ్రహ్మంగారు చెప్పారు. అది ఎంత వరకు నిజమౌతుందో తెలియదు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అతి చిన్న దూడ పుట్టింది.

తూర్పు గోదావరి జిల్లా గుమ్మలూరులో ఈ విచిత్ర కరమైన సంఘటన జరిగింది. గుమ్మలూరులో నివసిస్తున్న రైతు ముత్యాల వీరభద్రరావుకు చెందిన ఆవు అతిచిన్న పుంగనూరు దూడకు జన్మనిచ్చింది. దీని ఎత్తు కేవలం 15.6 అంగుళాలు కాగా, పొడవు 22 అంగుళాలు మాత్రమే ఉంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం 7.4 కిలోల బరువుతో ఇది జన్మించింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని కొంత మంది వైద్యులు మరికొంత మంది నిష్నాతులు చెబుతున్నారు. ఈ విషయాన్ని భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేస్తున్నట్లు భారత బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ అన్నపూర్ణ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories