ప్రజావేదిక కూల్చి వేత ... ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం

ప్రజావేదిక కూల్చి వేత ... ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం
x
Highlights

ప్రజావేదిక కూల్చి వేత సందర్భంగా ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ మండిపడుతోంది.. ప్రజాధనంతో నిర్మించిన వేదికను...

ప్రజావేదిక కూల్చి వేత సందర్భంగా ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ మండిపడుతోంది.. ప్రజాధనంతో నిర్మించిన వేదికను కూల్చివేయడం దారుణమన్నారు. అక్రమ నిర్మాణాలన్నీ తొలగించిన తర్వాతే ప్రజావేదికను కూల్చి వేస్తే బాగుంటుందన్నారు. విపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి ఉండవల్లి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కాన్వాయ్ లో చంద్రబాబు తన నివాసానికి వెళ్తున్న సమయంలోనూ ప్రజావేదిక కూల్చివేత పనులు సాగుతుండగానే..అవేం పట్టించుకోకుండా పక్క నుంచే చంద్రబాబు వెళ్లిపోయారు.

కళ్ల ముందే 'ప్రజా వేదిక'ను కూల్చివేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉద్వేగానికి లోనయైన టీడీపీ నేతలు.. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మరో వైపు టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో ప్రజావేదిక కూల్చివేత.. రాష్ర్టంలో తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చిస్తున్నారు.

చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు. ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రజావేదికతోపాటు కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలను, సమీప గ్రామాల ప్రజలను అటువైపు రాకుండా నిషేధం విధించారు. మీడియాను సైతం ప్రజావేదిక సమీపానికి అనుమతించడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories