బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం

బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం
x
బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 59.85 రిజర్వేషన్ల శాతాన్ని 50 శాతానికి...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 59.85 రిజర్వేషన్ల శాతాన్ని 50 శాతానికి కుదించాలంటూ హైకోర్టు తీర్పుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. బీసీల ద్రోహి మీరంటే మీరు అంటూ ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59.85 శాతం కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 176ను విడుదల చేసింది. ఇందులో బీసీ లకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీ లకు 6.77 శాతం కేటాయించారు. బీసీలకు 59.85 శాతాన్ని కేటాయించడాన్ని రెడ్డి సంక్షేమ సంఘం నాయకుడు, మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. జీవో నెంబర్ 176ను తప్పుబట్టింది.

హై కోర్టు తీర్పు విషయంలో జగన్ ప్రభుత్వం తీరును ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తప్పుబట్టారు. ఈ విషయంలో గతంలో కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లితే తాము ఇంటెరిమ్ ఆర్డర్స్ తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ బీసీ ద్రోహిగా మిగిలిపోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. బీసీలకు మోసం చేసింది చంద్రబాబే అని మంత్రులు మోపిదేవి వెంకట రమణ, జయరాములు, ధర్మాన కృష్ణదాసు ఆరోపించారు. 2018 లో నాటి చంద్రబాబు ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ని విడుదల చేశారు. బీసీ లకు మేలు దక్కకుండా గత టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుందని మంత్రులు విమర్శించారు. రాజకీయ రగడను పక్కన పెడితే, స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి అంటూ సీఎం జగన్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories