ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
x
Highlights

ఏపీ‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర...

ఏపీ‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు.

కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. గత ఏడాది నవంబర్ 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories