మరోసారి టంగ్ స్లిప్ అయిన టీజీ వెంకటేష్

మరోసారి టంగ్ స్లిప్ అయిన టీజీ వెంకటేష్
x
Highlights

బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ మరో సారి టంగ్ స్లిప్ అయ్యారు. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకి హాజరు కావడానికి వెళ్ళిన అయన అక్కడ ప్రెస్ మీట్...

బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ మరో సారి టంగ్ స్లిప్ అయ్యారు. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకి హాజరు కావడానికి వెళ్ళిన అయన అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ అయన మాట్లాడుతూ .. చైనాలో ఉన్న తెలుగు వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నం అభినందించాల్సింది అని అన్నారు. ఈ సందర్భంగా మా తెలుగుదేశం ఎంపీలు అంటూ నాలుక కరుచుకున్నారు. అక్కడ ఉన్న మీడియా ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారని గుర్తు చేశారు. దీనితో వెంటనే అలర్ట్ అయన మా తెలుగు ఎంపీలు అంటూ సరిదిద్దుకున్నారు. టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరి చాలా రోజులే అయింది.

ఇక వైసీపీ పార్టీ ప్రతిపదిస్తున్న మూడు రాజధానుల అంశాన్ని అయన తప్పు బట్టారు, అమరావతి ఓ పెద్ద వివాదంగా తయారైందన్నారు. రాజధానిగా అమరావతి పనికిరాదంటూనే అక్కడ శాసన రాజధాని పెడతామని చెబుతున్నారని తెలిపారు. రాజధానిని కోస్తా, రాయలసీమలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ, ఏడాదిలో ఒక్కో సమావేశం వేర్వేరు ప్రాంతాల్లో పెడితే బాగుంటుందని సూచించారు. గ్రామా సచివాలయాల మాదిరిగానే హైకోర్టు, అసెంబ్లీ, మినీ సెక్రటేరియేట్లు మూడు ప్రాంతాల్లోనూ పెట్టాలని టీజీ వెంకటేష్ సూచించారు.

టీజీ వెంకటేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిగా పని చేశారు. ఇక 2014లో టీడీపీలో చేరి కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీ ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఇక మళ్ళీ ఆ పార్టీని వదిలి 2019లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయన ప్రెస్ మీట్ లో మాత్రం పార్టీని సంభోదించే క్రమంలో అయన పలుమార్లు తడబడ్డారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories