ఛలో ఆత్మకూరుతో పల్నాడులో టెన్షన్ టెన్షన్‌

ఛలో ఆత్మకూరుతో పల్నాడులో టెన్షన్ టెన్షన్‌
x
Highlights

పల్నాడులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రాజకీయ దాడులపై ప్రతిపక్ష టీడీపీ.... అధికార వైసీపీ... పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో.... పోలీసులు...

పల్నాడులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రాజకీయ దాడులపై ప్రతిపక్ష టీడీపీ.... అధికార వైసీపీ... పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో.... పోలీసులు రంగంలోకి దిగారు. పల్నాడు అంతటా 144 సెక్షన్‌, పోలీస్ యాక్ట్ 30 విధించి, ఎక్కడికక్కడ పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. అయితే, పల్నాడులో ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్న ఏపీ డీజీపీ... ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఛలో ఆత్మకూరు పిలుపుతో టీడీపీ కార్యాలయం దగ్గర పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చే అవకావశముండటంతో... భారీగా బలగాల మోహరింపుతోపాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, రాత్రికే టీడీపీ ముఖ్యనేతలను ముందస్తు అరెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఉండవల్లి నివాసంలో హౌస్ అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories