మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు

మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు
x
Highlights

ఓ విద్యార్ధినికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ది మళ్ళింది. విధ్యాభోదన చేయాల్సింది పోయి ప్రేమ అంటూ అ బాలికను లొంగదీసుకున్నాడు . ఫలితంగా...

ఓ విద్యార్ధినికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ది మళ్ళింది. విధ్యాభోదన చేయాల్సింది పోయి ప్రేమ అంటూ అ బాలికను లొంగదీసుకున్నాడు . ఫలితంగా ఆమె ఆరు నెలల గర్భం దాల్చింది . ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఆదిమూర్తిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది . గత ఏడాది పదవ తరగతి పూర్తి చేసుకున్న ఓ బాలిక(16) ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడుగు పెట్టింది . దసరా సేలువులకి అని తన గ్రామానికి వచ్చింది .ఈ నేపధ్యంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే బొమ్ము వీరయ్య అనే వ్యక్తి అ బాలిక పై కన్నేశాడు .

ప్రేమ అంటూ ఆమె వెంట తిరిగాడు.. మాయమాటలు చెప్పి ఆమెను తన వెంట తీసుకువెళ్ళాడు . బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . తొమ్మిది నెలలు గడిచిన పోలీసులు కేసుని చేధించలేకపోయారు . అయితే అక్కడికి కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిద్దార్ధ కౌశల్ దృష్టికి ఈ కేసు రావడంతో బాలికను మరియు వీరయ్యను సికింద్రాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories