logo

రేషన్ డీలర్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కొడాలి నాని

రేషన్ డీలర్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కొడాలి నాని
Highlights

రేషన్ డీలర్లపై ఏపీ అసెంబ్లీలో మినీ వార్ సాగింది. రేషన్ డీలర్లను కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అంటూ టీడీపీ...

రేషన్ డీలర్లపై ఏపీ అసెంబ్లీలో మినీ వార్ సాగింది. రేషన్ డీలర్లను కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అంటూ టీడీపీ సభ్యుడు ప్రశ్నించడంతో అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. చంద్రబాబు సర్కార్‌ మాదిరిగా తమ ప్రభుత్వం ఎవరి పొట్టా కొట్టదన్న మంత్రి కొడాలి నాని అక్రమార్కులను మాత్రం వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు.

రేషన్ డీలర్లు, గ్రామ వాలంటీర్ల నియామకంపై ఏపీ అసెంబ్లీలో మినీ వార్ జరిగింది. వాలంటీర్ల ద్వారా గడపగడపకూ రేషన్ సరుకులను డెలివరీ చేస్తామంటున్నారని, అలాగైతే రేషన్ డీలర్ల పరిస్థితి ఏంటంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు రామానాయుడు వ్యాఖ్యలపై పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు మాదిరిగా తమ ప్రభుత్వం ఎవరి పొట్టా కొట్టదన్న కొడాలి నాని కేవలం అక్రమార్కులపై మాత్రమే చర్యలు తీసుకుంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సానుభూతిపరులైన రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగించి, అక్రమంగా కేసులు పెట్టారని, అలాంటి వాటిని సమీక్షించి, కేసులు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి హామీ ఇచ్చారు.


లైవ్ టీవి


Share it
Top