వెల్లంపల్లిపై కేశినేని నాని విమర్శలు.. శవాల మీద కూడా..

వెల్లంపల్లిపై కేశినేని నాని విమర్శలు.. శవాల మీద కూడా..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అధికారం అడ్డుపెట్టుకొని,...

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అధికారం అడ్డుపెట్టుకొని, వ్యాపారస్తులను బెదిరించి మరీ దండుకుంటున్నారని ఆరోపించారు. అమాత్యా ఇదేం పని? అంటూ విమర్శలు గుప్పించారు.

వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావు. దుర్గగుడిని మింగేస్తున్నావు, వినాయక గుడి ఆదాయం కాజేస్తున్నావు. చివరికి ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో కూడా వ్యాపారం ఏమిటి నాయనా? శవాల మీద కూడా పైసలు సంపాదించేట్టు ఉన్నావు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మంత్రి అనుచరుడొకరు నకిలీ శానిటైజర్లతో దోచేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని కూడా నాని ట్విట్టర్ లో పంచుకున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories