Top
logo

గవర్నర్‌తో టీడీపీ నేతలు ఏం మాట్లాడారు..?

గవర్నర్‌తో టీడీపీ నేతలు ఏం మాట్లాడారు..?
Highlights

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు రాజ్ భవన్‌కు వెళ్లారు. చంద్రబాబు భద్రతపై గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు రాజ్ భవన్‌కు వెళ్లారు. చంద్రబాబు భద్రతపై గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, రవీంద్ర నాత్, కేశినేని నాని, తోట సీతా మహాలక్ష్మి, ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. వరద సహాయక కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు సంచరించడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లాడంటూ విమర్శించారు. చంద్రబాబు నివాసం మునిగిపోవాలనే ఉద్దేశంతోనే ప్రకాశం బ్యారేజ్ లో నాలుగు టీఎంసీలను నిల్వ చేశారని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మూడు టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టులో నాలుగు టీఎంసీలను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో 220 టీఎంసీల నీళ్లు వృథా అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు.

Next Story


లైవ్ టీవి