టీడీపీలో భారీ సంక్షోభం!

టీడీపీలో భారీ సంక్షోభం!
x
Highlights

ఏపీ టీడీపీలో భారీ సంక్షోభం నెలకొంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై కోలుకోలేని దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఓడిన నేతలంతా...

ఏపీ టీడీపీలో భారీ సంక్షోభం నెలకొంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై కోలుకోలేని దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఓడిన నేతలంతా షాకిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడలో సమావేశమైన టీడీపీ కాపు నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. బీజేపీ లేదా వైసీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో దాదాపు 15మంది ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వీళ్లంతా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీని వీడి బీజేపీ లేదా వైసీపీలో చేరేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్లంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు టాక్ అందుతోంది.

ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బోండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేశ్‌బాబు, ఈలి నాని తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే తాము తెలుగుదేశాన్ని వీడటం లేదని ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీ కాపు నేతంలా సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభాపక్షం మొత్తం బీజేపీలో విలీనమవుతున్న నేపథ్యంలో కాకినాడలో తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం కలకలం రేపుతోంది. అయితే కాకినాడలో సమావేశమైన నేతలతో సుజనాచౌదరి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఏపీలో బలమైన సామాజికవర్గంగా, పెద్దసంఖ్యలో ఉన్న కాపులను అక్కున చేర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్నదే బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే ముందుగా కాపు నేతలపై కన్నేసిన కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక సామాజిక వర్గం టీడీపీకి మరో సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలుస్తున్న నేపథ్యంలో కాపులకు బీజేపీ ఉందనే సంకేతాలను కాషాయ పార్టీ పంపుతోందంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories