క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పే టీడీపీలో నేతలు క్రమశిక్షణ తప్పారా..?

క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పే టీడీపీలో నేతలు క్రమశిక్షణ తప్పారా..?
x
Highlights

క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పే టీడీపీలో నేతలు క్రమశిక్షణ తప్పారా..? బహిరంగ విమర్శలు చేస్తూ నేతలు రచ్చకెక్కినా పార్టీ అధినేత నోరు మెదపడం లేదెందుకు..?...

క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పే టీడీపీలో నేతలు క్రమశిక్షణ తప్పారా..? బహిరంగ విమర్శలు చేస్తూ నేతలు రచ్చకెక్కినా పార్టీ అధినేత నోరు మెదపడం లేదెందుకు..? అసలు టీడీపీలో ఏం జరుగుతోంది...? ఆ పార్టీ నేతల ట్వీట్ వార్‌కు కారణం ఏమిటి..? టీడీపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలు మరోసారి బయటపడ్డాయి. ట్విటర్ వేదికగా లీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరోకరు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

ట్విట్ వార్‌ను మొదలు పెట్టింది కేశినేని నానినే అంటున్నారు టీడీపీ నేతలు. నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని మొదట విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, బుద్ధా వెంకన్నను విమర్శించారు. ఈ విమర్శలను స్పందించిన బుద్ధ వెంకన్న సంక్షోభంలో టీడీపీకి పార్టీని కాపాడేవాడు కావాలనీ, నీలా కూల్చేసేవాడు కాదని కౌంటర్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలపై కేశినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. కొందరు నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారనీ, రేపటి నుంచి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరివీ కాళ్లు మాత్రమేననీ, వ్యక్తులు మాత్రమే తేడా అని కేశినేని నాని మరో ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన బుద్దా వెంకన్న.. కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు అని విమర్శించారు. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు అని కేశినేనిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్విట్ మీద స్పందించిన కేశినేని రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకి అవసరమని తనకు అవసరం లేదని అన్నారు. కేశినేని నాని నేరుగా చంద్రబాబుకే ట్వీట్ చేశారు. తన లాంటి వారు టీడీపీలో ఉండటానికి ఇష్టం లేకపోతే ఎంపీ స్థానానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. అలాగే మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండని తీవ్ర స్థాయిలో ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. వీరిద్దరే ఒకరిపై మరోకరు ట్వీట్లో ఈ విధంగా చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

కాగా ఈ నేపథ్యంలో బుద్దావెంకన్న మాత్రం ఇక నుండి ట్వీటర్లో నేను మళ్లీ తలదూర్చను అని.. ఇక నుండి ట్వీట్టర్ల స్పందిచను అని తన బలహిన వర్గానికి చెందినటువంటి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి ఎంతో రుణపడి ఉంటాను. తాను చాలా విశ్వసంగా ఉంటానని అన్నారు. దీనిపై కేశినేని నాని స్పందిచలేదు. అయితే బుద్దా వెంకన్నకు నారా చంద్రబాబు గట్టి వర్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వీరిద్దరి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ మాత్రం స్పందిచలేదు. అయితే నేటి సాయంత్రం కేశినేని నాని, బుద్దావెంకన్నను పిలిచి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. చూడాలి మరి వీరిపై పార్టీ అధినేత చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories