logo

వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ వర్ల రామయ్య ట్వీట్‌‌..

వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ వర్ల రామయ్య ట్వీట్‌‌..
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల ముగింది. ఈ రెండు నెలల వ్యవధిలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పలు మీడియా సంస్థల్లో ఏపీ సర్కార్ మీ సేవను రద్దుచేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల ముగిసింది. ఈ రెండు నెలల వ్యవధిలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పలు మీడియా సంస్థల్లో ఏపీ సర్కార్ మీ సేవను రద్దుచేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఏపీలో మీసేవ రద్దు చేస్తున్నట్లు జోరుగా వినిపిస్తున్న వార్తలు నిజమో కాదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దినిపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. అసలు ఏపీ సర్కార్ ఇలాంటి విపరితమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 73 మూడు రోజుల పరిపాలన రద్దుల పాలనగా పేరు పొందిదని ఆయన ఎద్దేవా చేశారు. ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండే మీ సేవను రద్దు చేయవద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వర్ల రామయ్య ట్వీట్ ద్వారా పెర్కోన్నారు.


లైవ్ టీవి


Share it
Top