అధికార వైసీపీ పై అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

అధికార వైసీపీ పై అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు
x
atchannaidu(File Photo)
Highlights

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాజకీయ నాయకుల మధ్య మాటల దూమారం పెరుగుతుంది. కేసులు పెరగడానికి

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాజకీయ నాయకుల మధ్య మాటల దూమారం పెరుగుతుంది. కేసులు పెరగడానికిమీరంటే మీరేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రెస్‌మీట్‌పై టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు వైఎస్ వార‌సుడిగా మీకుందేమో కానీ లాక్‌డౌన్‌తో తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడిపోతున్న పేద‌ల‌కు లేదు. జ్వర‌మే క‌దా త‌గ్గిపోతుందంటున్నారు, మ‌రి తాడేప‌ల్లి కొంప దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదెందుకు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే కోవిడ్ ప‌రీక్షలు చేయ‌డంలో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ అని ప్రకటించారు. వేగంగా వ్యాప్తిలో, ఎక్కువ మ‌ర‌ణాల్లోనూ, త‌క్కువ రిక‌వ‌రీలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీయే నెంబ‌ర్‌వ‌న్. విశాఖ‌ప‌ట్నంలో కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్యపెడుతున్నారని అచ్చెన్నాయుడు వాఖ్యానించారు.

ఇక 1600కి పైగా పెండింగ్ లో ఉన్న టెస్టుల ఫలితాలు వెల్లడించండి. లెక్క తేలిపోతుంది. పాజిటివ్ వస్తే డిశ్చార్జి చేసి, నెగెటివ్ అయితే వైద్యం చేస్తున్నప్పుడే మీ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమైంది. రోజూ చంద్రబాబు గారి మీద పడి ఎడవడం ఆపి కరోనా కట్టడి కోసం పనిచేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు..

ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కోవిడ్19 పాజిటివ్ గా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక అందులో 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories