ఆ వర్గం నేతలు టీడీపీకి దూరం అవుతున్నారా..?

ఆ వర్గం నేతలు టీడీపీకి దూరం అవుతున్నారా..?
x
Highlights

ఆ వర్గం నేతలు టీడీపీకి దూరం అవుతున్నారా..? చంద్రబాబుతో సమావేశానికి హాజరు కానిదెందుకు..? భేటీకి రాని నేతలు పార్టీ మారతారా..? బాబుతో సమావేశానికి డుమ్మా...

ఆ వర్గం నేతలు టీడీపీకి దూరం అవుతున్నారా..? చంద్రబాబుతో సమావేశానికి హాజరు కానిదెందుకు..? భేటీకి రాని నేతలు పార్టీ మారతారా..? బాబుతో సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ నేతలు ఏం చెబుతున్నారు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిలోనూ మెదులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు తెలుగుదేశాన్ని వీడుతుండటంతో నేతల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశానికి టీడీపీకి చెందిన కీలక నేతలు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి హాజరుకాని నేతలంతా ఇటీవల కాకినాడలో సమావేశం అయ్యారు. దీంతో వీరు పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, సీనియర్ నేతలు తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేశ్ బాబు, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు చంద్రబాబుతో సమావేశానికి హాజరు కాలేదు. అయితే సమావేశానికి వచ్చిన నేతలతో చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

అయితే చంద్రబాబుతో జరిగిన కీలక నేతల సమావేశానికి ఎందుకు రాలేదో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కేవలం అందుబాటులో ఉన్న నేతలతో మాత్రమే భేటీ అయ్యారని రెండు మూడు రోజుల్లో తాము స్వయంగా వెళ్లి కలుస్తామని చెప్పారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు తోట త్రిమూర్తులు. మొత్తానికి టీడీపీ ముఖ్యనేతల సమావేశానికి కొంతమంది హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories