నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ నిరసన కార్యక్రమం

నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ నిరసన కార్యక్రమం
x
Highlights

వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఇవాళ ఛలో పల్నాడు -సేవ్ డేమోక్రసీ పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. పల్నాడులో ఆ పార్టీ నాయకులు పర్యటించి, ...

వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఇవాళ ఛలో పల్నాడు -సేవ్ డేమోక్రసీ పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. పల్నాడులో ఆ పార్టీ నాయకులు పర్యటించి, కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీస్ అధికారులను కోరుతారు.గుంటూరు లోని ఎన్టీఆర్ భవన్ లో నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు, అక్రమ కేసుల గురించి చర్చించారు. పోలీసులు రక్షణకల్పించలేమని చేతులైతేశారని టీడీపీ నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేంత వరకు పోరాడుతామని క్యాడర్ కుచంద్రబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో వైసీపీ దాడులకు నిరసనగా ఇవాళ టీడీపీ ఛలో పల్నాడు -సేవ్ డేమోక్రసీ పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లో టీడీపీ నేతల బృందం పర్యటించి కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తుంది. గురజాల, నరసరావుపేట, మాచర్ల డీఎస్పీ లను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. వైసీపీ దాడులకు బెదరమని, పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు టీడీపీ నాయకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories