ఇళ్ళల్లోనే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం : చంద్రబాబు నాయుడు

ఇళ్ళల్లోనే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం : చంద్రబాబు నాయుడు
x
Chandrababu (File Photo)
Highlights

రేపటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.

రేపటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ''ఇళ్లపై టిడిపి జెండాలు ఎగరేయాలి. ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని'' సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు. సామాజిక బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం. సామాజిక మార్పు తెచ్చిన పార్టీ టిడిపి.

''సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు'' టిడిపి సిద్దాంతం.

♦ విద్యాధికులను రాజకీయాల్లోకి తెచ్చిన పార్టీ టిడిపి. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది.

♦ దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీల మధ్య, ఆయా ప్రభుత్వాల మధ్య ''తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత'' అనే సరికొత్త యుగాన్ని ఆరంభించిన పార్టీ టిడిపి.

♦ పేదలకు తినడానికి తిండి, ఉండటానికి ఫక్కా ఇల్లు, కట్టుకోడానికి బట్ట అందించిన పార్టీ.

♦ ఆత్మగౌరవం కాపాడుకోవడానికే పుట్టిన పార్టీ.

♦ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉపాధి అవకాశాలను విస్తృతం చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ముద్ర వేసిన పార్టీ టిడిపి.

♦ అభివృద్ది ప్రాజెక్టులు, పేదల సంక్షేమం, బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడింది.

♦ ఎన్నో వినూత్న సంక్షేమ పథకాల ద్వారా రైతులు, యువత, మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేసింది.

♦ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం.

♦ అంత స్పష్టమైన పనితీరును కనబర్చడమే కాదు, 37ఏళ్లుగా అదే పనితీరుతో ముందుకు పోతోంది.

♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి.

♦ మనదేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బెడద రోజురోజుకూ తీవ్రం అవుతోంది.

♦ ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి.

♦ పార్టీ సిద్దాంతాలకు పునరంకితం కావాలి.

♦ అన్నివర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా టిడిపి కార్యకర్తలు, నాయకులు పని చేయాలి.

♦ ఎన్టీఆర్ చూపిన బాటలో ఆయన ఆశయాల సాధన కోసం నడవాలని'' చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories