చంద్రబాబుకి సొంత జిల్లా నుంచే భారీ షాక్... టీడీపీకి మరో నేత గుడ్ బై

చంద్రబాబుకి సొంత జిల్లా నుంచే భారీ షాక్... టీడీపీకి మరో నేత గుడ్ బై
x
chandrababu(File Photo)
Highlights

గతేడాది ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి..

గతేడాది ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ టీడీపీకి షాక్ ఇస్తూ అధికార పార్టీ వైసీపీలోకి చేరిపోయారు. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి మరో కీలక నేత పార్టీని వీడారు..

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబు పంపించారు . గత 27 సంవత్సరాలుగా పార్టీలో కీలక పాత్ర పోషించిన తనకి సరైన ప్రాధాన్యం లభించకపోవడంతోనే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు ఆమె అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన వర్గానికి, పార్టీ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వలేదనేది లలితా కుమారి ఆరోపించారు. తాను పంపించిన జాబితాలో ఏ ఒక్కరికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పించలేదని లలిత కుమారి అభిప్రాయపడ్డారు. త్వరలో తన అభిమానులతో, అనుచరులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇక లలిత కుమారి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి 2004లో విజయం సాధించారు. ఇక 2009, 2014లో తేదేపా అభ్యర్థిగా పూతలపట్టు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న లలిత కుమారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేశారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories