పరకామణిలో టీటీడీ సరికొత్త ప్రయోగం

పరకామణిలో టీటీడీ సరికొత్త ప్రయోగం
x
Highlights

టీటీడీ ట్రెజరీలో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న చిల్లర నాణేలు ఒకవైపు.... లెక్కింపుపై ఉద్యోగుల్లో పెరిగిపోతున్న అనాసక్తి మరోవైపు.... ఈ రెండూ టీటీడీకి...

టీటీడీ ట్రెజరీలో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న చిల్లర నాణేలు ఒకవైపు.... లెక్కింపుపై ఉద్యోగుల్లో పెరిగిపోతున్న అనాసక్తి మరోవైపు.... ఈ రెండూ టీటీడీకి అతిపెద్ద సమస్యగా మారాయి. దాంతో పరామణిలో పేరుకుపోతున్న కానుకలను లెక్కించడానికి టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. కానుకల లెక్కింపులో విద్యార్ధులను వినియోగించుకోవాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడువుగా ప్రయోగాత్మకంగా అమలు చేసింది.

తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం.... టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌, ఎస్వీ ఓరియంటల్‌ కాలేజీల విద్యార్ధులను పరకామణిలో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా 50మంది ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులతో.... ప్రయోగాత్మకంగా కరెన్సీ నోట్ల లెక్కింపు చేపట్టారు. అలాగే ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌, ఎస్వీ ఓరియంటల్‌ కాలేజీల నుంచి మరో 100మంది విద్యార్ధులు తీసుకుని.... చిల్లర నాణెలను కౌంట్ చేశారు.

పరకామణిలో హుండీ కానుకలను లెక్కించిన విద్యార్ధులకు ఉచితంగా పంచెలను అందించింది టీటీడీ. అలాగే శ్రీవారి దర్శనంతోపాటు ఉద్యోగులకు కేటాయించే తరహాలో ఐదు రూపాయల చొప్పున నాలుగు లడ్డూలను అందజేసింది. అదేవిధంగా ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కల్పించారు.

శ్రీవారి కానుకల లెక్కింపులో విద్యార్ధులను వినియోగించడం ద్వారా ట్రెజరీలో పేరుకుపోతున్న చిల్లర నాణేల సమస్య తీరుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు హుండీ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇక, విద్యార్ధులతో కానుకల లెక్కింపు విజయవంతమైతే.... శ్రీవారి సేవకులను తగ్గించేందుకు టీటీడీ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories