Top
logo

తాడేపల్లి పోలీసుల " మూగమ్మ" మృతి

తాడేపల్లి పోలీసుల " మూగమ్మ" మృతి
Highlights

ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఆమెకు నా అన్నవారు ఎవరూ లేరు. నోటి వెంట మాట రాక పోయినా ఎదుటివారు...

ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఆమెకు నా అన్నవారు ఎవరూ లేరు. నోటి వెంట మాట రాక పోయినా ఎదుటివారు చెప్పిన మాటలను ఇట్టే అర్థం చేసుకోగలుగుతుంది. తాడేపల్లి పోలీసులే ఆమెను చేరదీశారు. ఆమెకు మాటలు రాకపోవడంతో మూగమ్మ అంటూ పిలుస్తూ కన్న తల్లిలా భావించి కంటికి రెప్పలా చూసుకున్నారు.

ముప్పై ఏళ్లుగా మూగమ్మ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లోనే చిన్నా, చితక పనులు చేస్తుంది. అలా స్టేషన్ లోని పోలీసుల హృదయాల్లో నిలిచింది. అయితే, ఆకస్మాత్తుగా అనారోగ్యంతో మూగమ్మ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన తాడేపల్లి పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు.

చేదోడుగా ఉండే మాతృమూర్తిని కోల్పోయామని ఆవేదన చెందిన పోలీసులు. తాడేపల్లి సీఐ నరేష్, ఎస్సై నారాయణ, పలువురు పోలీసు సిబ్బంది పాడెమోసీ మూగమ్మమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు మూగమ్మపై ప్రేమను చాటుకున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it