మా నాన్న బీజేపీలోకి వెళ్ళినా నేను టిడిపిలోనే కొనసాగుతాను .. భరత్

మా నాన్న బీజేపీలోకి వెళ్ళినా నేను టిడిపిలోనే కొనసాగుతాను .. భరత్
x
Highlights

తాజాగా టిడీపీ కి చెందినా నలుగురు రాజ్యసభ సభ్యలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే .. అందులో టిజి వెంకటేష్ ఒకరు .. అయితే దీనిపైన అయన తనయుడు భరత్...

తాజాగా టిడీపీ కి చెందినా నలుగురు రాజ్యసభ సభ్యలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే .. అందులో టిజి వెంకటేష్ ఒకరు .. అయితే దీనిపైన అయన తనయుడు భరత్ స్పందించారు.. తన తండ్రి బీజేపీలోకి వెళ్ళినా తానూ మాత్రం టిడీపీ లోనే కొనసాగుతానని స్పష్టం చేసారు .. ఇదే విషయాన్ని మాజీ మంత్రి లోకేష్ కి ఫోన్ లో కూడా చెప్పినట్లు అయన తెలిపారు .. చంద్రబాబు మరియు లోకేష్ యూరప్ నుండి వచ్చాక వెళ్లి కలుస్తానని అయన అన్నారు .. అయితే తన తండ్రి లాగే తానూ కూడా బీజేపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి .. తన తండ్రి బీజేపీలో చేరేముందు తనకి చెప్పారని ఇక తనని ఏ పార్టీలో ఉండాలో తన ఇష్టమేనని చెప్పారని అయన అన్నారు .. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భరత్ కర్నూలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి నాలుగు వెయిల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories