ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే..

ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే..
x
Highlights

ఏపీలో ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే చంద్రబాబు కట్టప్పలా వెనుక ఉండి వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ ముఖ్య నేత సునీల్ దియోధర్ ఆరోపించారు. బీజేపీ చేపట్టిన...

ఏపీలో ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే చంద్రబాబు కట్టప్పలా వెనుక ఉండి వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ ముఖ్య నేత సునీల్ దియోధర్ ఆరోపించారు. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నసునీల్ దియోధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చందాల బాబులా మారారని, అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో సైతం అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండేళ్లలో జైలు కెళ్తారని, కరకట్టపై ఉన్న ఇంటిని చంద్రబాబుతో ఖాళీ చేయిస్తే ఆ ఇంటిని వదిలి ఆయన వెళ్లేది జైలుకేనని సునీల్ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories