కౌలాలంపూర్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగు విద్యార్ధులు

కౌలాలంపూర్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగు విద్యార్ధులు
x
Highlights

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నక్రమంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తీసుకు...

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నక్రమంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫిలిప్పీన్స్‌లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏసియా విమానాలను అనుమతించడంతో అక్కడ చిక్కుకున్న వారంతా సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు.

మలేసియాలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు భారత్‌ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో కౌలాలంపూర్‌ నుంచి విశాఖ పట్నానికి చేరుకున్నారు. విశాఖ చేరుకున్న వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనుమానితులను క్వారంటైన్ వార్డుకు తరలించారు. సాధారణ ఆరోగ్యస్థితి ఉన్నవారిని వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

మలేషియాలో చదువుకుంటున్నభారత విద్యార్ధులు గత కొన్నిరోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారు 72 గంటల్లోగా దేశం విడిచివెళ్లాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానాశ్రయంలోకి రావడానికి మలేషియా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయ అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులు వీడియోలు తీసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మీడియా ద్వారా తమ సమస్యను తెలియజేశారు. సుమారు 300 మంది విద్యార్థులం ఫిలిప్పీన్స్‌లో ఉన్నామని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తినేందుకు ఆహారం కూడా లేదని చెబుతున్నారు. తమను భారత ప్రభుత్వం వెంటనే స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఆ వీడియోలను చూసిన వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరారు.

భారత విద్యార్ధుల ఆవేదనను అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగింది. మలేషియా అధికారులతో సంప్రదింపులు జరిపి భారత విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది. సీఎంవో, ఏపీ భవన్‌ అధికారులు సమన్వయం చేసుకుంటూ విదేశాంగ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. దీంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో చిక్కుకొని సాయం కోసం అర్థిస్తున్న సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా సొంతూళ్లకు చేరుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories