జగన్ సర్కార్ కీలక నిర్ణయం...

జగన్ సర్కార్ కీలక నిర్ణయం...
x
Jagan(File photo)
Highlights

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఏపీలో 10 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తాజాగా జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక తాజాగా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే హాజరును బట్టి పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది.

ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.. ఇక ఏపీతో పాటు తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు కూడా పరీక్షలు నిర్వహించలేమని ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories