నిరుపేదలా.. పర్యావరణమా? సంకటంలో కాకినాడలో పేదల గూడు!

నిరుపేదలా.. పర్యావరణమా? సంకటంలో కాకినాడలో పేదల గూడు!
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కాకినాడ నగరంలో ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం కాకినాడకు నగరానికి ఆనుకుని...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కాకినాడ నగరంలో ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం కాకినాడకు నగరానికి ఆనుకుని దుమ్ములపేట సమీపంలో ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్న భూమిపై చిక్కులు మొదలయ్యాయి అధికారులు ఎంపిక చేసిన ఈ ప్రాంతంలో మడ మొక్కలు పెరగటమే ప్రభుత్వానికి గండంగా మారింది. ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే తమ జీవ వైవిధ్యాన్ని విఘాతం కలుగుతుందని కాకినాడకు చెందిన కొందరు మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు మడ చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేయడంతో కాకినాడలో హౌసింగ్ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కొన్ని చోట్ల చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ విషయంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలోని భూమిపై వివాదం చెలరేగింది. గతంలో కాకినాడ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 126 ఎకరాలు కేటాయించింది. ఇందులో అయిదు ఎకరాలు రైల్వే శాఖ అవసరాలకు ఇచ్చారు. మిగిలిన 116 ఎకరాల్లో సముద్రం నీరు ప్రవహించడం వల్ల ఉప్పు నీటి కాలువలుగా ఏర్పడ్డాయి.

కాకినాడ దుమ్ముల పేటలో నివసించే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడానికి ఈ ఉప్పునీటి కాలువలను ఉపయోగించుకుని చేపల వేటకుచిన్న పడవల్లో వెళుతారు. సముద్రం నీరు ప్రవహిస్తుండటంతో ఈ భూముల్లో మడ మొక్కలు దట్టంగా పెరిగాయి. అడవిని తలపించే ఈ మడ మొక్కలు ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టాయి.

పేదల ఇళ్ల స్థలాల కోసం గతంలో కాకినాడ పోర్టుకు కేటాయించిన 116 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ భూముల్లో 4,600 మంది పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూమిని చదును చేసేందుకు మడ మొక్కలను అధికారులు కూలీల చేత నరికి వేశారు. ఇదే వివాదానికి దారి తీసింది. మడ మొక్కలను తొలగించడం లేదా నరికివేయడం అటవీ శాఖ చట్టం ప్రకారం నేరం. ఉప్పు నీటిలో మాత్రమే పెరిగే మడ మొక్కలు ఇతర ప్రాంతాల్లో పెరగవు. మరోవైపు మడ మొక్కల నరికివేతతో తమ మనుగడకు ఇబ్బంది కలుగుతుందని, జీవ వైవిధ్యానికి ఆటంకం ఏర్పడుతుందని మత్స్యకారులు హైకోర్టులో కేసు వేయగా, స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది.

విశాఖపట్నంకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ మడ మొక్కలను నరకడం వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, అంతేకాక మడ అడవులు ఎన్నో తుఫాన్ల నుండి కాకినాడను కాపాడాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ లో పటిషన్ వేశారు. మడ అడవులు ఉన్న ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని తప్పు పట్టారు. మడ అడవుల నరికివేత ఫిర్యాదుపై నిజనిజాలు తెలుసుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అయిదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కాకినాడ తీర ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. తదుపరి విచారణను ఆగస్టు 18 వరకు వాయిదావేసింది. మడ చెట్ల నరికివేతతో మొదలైన ఈ ఇళ్ల స్థలాల రగడ ఎంత వరకూ వెళుతుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories