logo

పోటా పోటీగా ఇసుక దోపిడీ : చంద్రబాబు నాయుడు

పోటా పోటీగా ఇసుక దోపిడీ : చంద్రబాబు నాయుడు
Highlights

రాజధానిలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీ వర్గం,...

రాజధానిలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని అయన విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ లో తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళల ఎదురుచూస్తున్నారనీ, అయితే సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైసీపీ శ్రద్ధ పెట్టిందని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కంపెనీలకు నష్టం రాకూడదు.. ఇతరుల కంపెనీలు మాత్రం నష్టాల్లో మునిగిపోవాలి అనేదే ఆయన దురాలోచన అని దుయ్యబట్టారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల్లో భరోసా నింపేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు లేవని విమర్శించారు. కౌలు రైతులకు రెండేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. అన్నివర్గాల సమస్యలు సభలో వినిపించాలని, పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీనేతలకు చంద్రబాబు సూచించారు.

లైవ్ టీవి

Share it
Top