కత్తులు దూస్తున్న పందెంకోళ్లు.. భారీగా తరలి వస్తున్న పందెంరాయుళ్లు

కత్తులు దూస్తున్న పందెంకోళ్లు.. భారీగా తరలి వస్తున్న పందెంరాయుళ్లు
x
కత్తులు దూస్తున్న పందెంకోళ్లు
Highlights

పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది. పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తూ...

పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది. పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తూ బరులు రెడీ చేశారు. భారీగా డబ్బులు చేతులు మారటంతో బరులు పందెంరాయుళ్లతో నిండిపోయాయి.

సంక్రాంతి సందర్భంగా కోడిపందాకు బరులు సిద్ధం అయ్యాయి. పలు జిల్లాల్లో వందల కొద్ది బరులు రెడీ చేశారు. ఇక్కడ నిర్వహించే కోడి పందాలను తిలకించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. కోడి పందాల నిర్వహణ కోసం వెలుగు జిలుగులతో బరులు సిద్ధం చేశారు. ఎయిర్ కూలర్లు, భారీ షామియానాలు, బారికేడ్ల మధ్య రాత్రి పగలు తేడా లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

కోడి పందాల్లో లక్షల్లో బెట్టింగ్‌లుంటాయి. క్రికెట్ బెట్టింగ్‌ల తరహాలోనే ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వేలల్లో పందాలు కాస్తారు. కొన్నిచోట్ల పందెం జరిగే ప్రాంతానికి వెళ్లకుండానే ఫోన్ల ద్వారానే బెట్టింగ్‌లు కట్టే ఏర్పాట్లు చేశారు. అలాగే కోడి పందాల దగ్గర గుండాటలు, పేకాటలు ఇతర జూదాలు కూడా యధేచ్చగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి.

అటు కోడి పందాలు ఆడే చోట జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతాయి. అందుకే కొందరు కోడి పందాల వద్ద ఈ దందా నడుపుతారు. సమీప పట్టణాల నుంచి మద్యం తీసుకువచ్చి ఎక్కువ మొత్తానికి అమ్మకాలు జరుపుతారు. అలాగే పందాల్లో పుంజులు చనిపోతే వెంటనే కోసి కూర చేసుకుని జూదరులు, నిర్వాహకులు కలిసి తింటారు. పందాల్లో గెలుస్తూ చివరి వరకు బతికున్న వాటిని కూడా సంక్రాంతి మరుసటి రోజు కోసుకుని తింటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories