logo

మరోసారి ఎత్తనున్న శ్రీశైలం గేట్లు !

మరోసారి ఎత్తనున్న శ్రీశైలం గేట్లు !
Highlights

గత కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దాదాపు కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణసాగర్, జూరాల, తుంగభద్ర, భీమ జలాశయాల గేట్లు తెరచుకోగా, మరికాసేపట్లో శ్రీశైలం గేట్లను ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దాదాపు కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణసాగర్, జూరాల, తుంగభద్ర, భీమ జలాశయాల గేట్లు తెరచుకోగా, మరికాసేపట్లో శ్రీశైలం గేట్లను ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి వస్తున్న వరద సుమారు 2 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో జలాశయం నిండుకుండను తలపిస్తో్ంది. ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోగా, ఇకపై నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో నేడు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి, నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నామని అధికారులు వెల్లడించారు.


లైవ్ టీవి


Share it
Top