జూ.ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చిన్నల్లుడు కీలక వ్యాఖ్యలు..

జూ.ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చిన్నల్లుడు కీలక వ్యాఖ్యలు..
x
Highlights

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చరిష్మా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేతలు అవసరం లేదన్నారు.

ఆయన ఒకప్పుడు ఒంటిచేతితో పార్టీని స్థాపించాడు. ఎన్నికల బరిలో దిగి.. తిరుగులేని విజయం సాధించాడు. ఆయనే "ఎన్టీఆర్". పాలన పరంగా ప్రజల మనసుదోచున్నారు ఎన్టీఆర్. సీఎంగా ఉన్నప్పుడు పేదలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల పెన్నిదిగా నిలిచాడు. అలాంటి తెలుగుదేశం పార్టీలో నేడు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అదే పార్టీని మాత్రం బాలకృష్ట లీడ్ చేయడం లేదు. 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడులేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనవడు జూ.ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు, అభిమానులు బలంగా కోరుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉందని జోరుగా చర్చ జరుగుతున్న వేళ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి చరిష్మా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేతలు అవసరం లేదన్నారు. ఒకవేళ ఆయన టీడీపీలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తెలుగు దేశం పార్టీయే సుప్రీం అని.. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ పాపులర్ అయినా.. ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి.. మంచీ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. పార్టీ అధినేత కూడా ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి(ఎన్టీఆర్) కూడా అనుకోవాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తోనే పార్టీ బాగుపడుతుందని తాను నమ్మడం లేదని పేర్కొన్నారు. యువ నాయకులే కాస్త ప్రతిభ కనబరిచి కొత్త ఆలోచనలు చేయగలిగితేనే పార్టీని చక్కదిద్దు పెట్టుకోవచ్చన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్‌పై భరత్ చేసిన కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. భరత్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. భరత్ వ్యాఖ్యలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories