తల్లిదండ్రులపై దయలేని పుత్రులు.. వృద్ధదంపతులకు శాపంగా మారిన లాక్‌డౌన్..

తల్లిదండ్రులపై దయలేని పుత్రులు.. వృద్ధదంపతులకు శాపంగా మారిన లాక్‌డౌన్..
x
Highlights

నవమాసాలు మోసి కన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారిని ప్రయోజకులను చేశారు. వృద్ధాప్యంలో కన్నపేగు తమకు తోడునీడగా ఉంటుందని...

నవమాసాలు మోసి కన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారిని ప్రయోజకులను చేశారు. వృద్ధాప్యంలో కన్నపేగు తమకు తోడునీడగా ఉంటుందని కలలు కన్నారు దంపతులు. కానీ వారి కలలన్నీ కల్లలు చేశారు కసాయి కొడుకులు. కన్న కొడుకులే కాదు పొమ్మన్నారు. దీంతో బుక్కెడు అన్నం పెట్టేవారే కరువయ్యారు. దీనికి తోడు లాక్‌డౌన్‌ వారి పాలిట శాపంగా మారింది. ఈ హృదయ విదారకర ఘటనపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ

తల్లిదండ్రులపై దయలేని పుత్రులు. బుక్కెడు అన్నం కోసం అష్టకష్టాలు. కన్నవారిపై దయా దాక్షిణ్యాలు చూపని కసాయిలు. వృద్ధదంపతులకు శాపంగా మారిన లాక్‌డౌన్‌

బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు పితృదేవతలను సైతం లెక్కచేయని మనుషులు దర్శనమిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వృద్ధదంపతులు సూర్యనారాయణ, వరలక్ష్మి ధీనపరిస్థితి అలాంటిదే. నలుగురు సంతానం ఉన్నా అనాధలుగా జీవిస్తున్నారు. మలిదశలో తోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రుల పట్ల దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించడంతో బుక్కెడు అన్నం నరకయాతన పడుతున్నారు. ఆస్తులను పంచుకున్నట్లు నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకుని వారి బాధ్యతను గాలికొదిలేశారు.

సూర్యనారాయణ రిటైర్‌ ఉద్యోగి. నలుగురు పిల్లల తండ్రివి నీకేంటయ్యా అన్న నోళ్లే ఇవాళ ఆమెను అయ్యో పాపం అంటున్నాయి. వృద్దాప్యంలో వారు పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. నిజానికి సూర్యనారాయణకు వచ్చే పిన్షన్‌తో దర్జాగా బతికేశారు. కానీవారికి వృద్ధాప్యమే శాపంగా మారింది. 90 ఏళ్ల సూర్యనారాయణ కనీసం పడుకునే చోట నుంచి లేచి కూర్చోలేని నిస్సహయస్థితి ఆయనది. దీంతో 89 ఏళ్ల భార్యే అన్ని అవసరాలను తీర్చుస్తూ కంటికి రెప్పాలా చూసుకుంటోంది. తల్లిదండ్రులకు తిండిపెట్టలేని దీన స్థితిలో ఏమీ లేని కొడుకులు వారి కన్నతండ్రికి వచ్చే పెన్షన్‌పై మాత్రమే మమకారం చూపుతున్నారు.

ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు చేయగా అఖరికొడుకు తోడుగా ఉంటాడనుకుంటే అతగాడు కన్నవారి కంటే జల్సాకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. పైగా తండ్రిగారికి వచ్చే డబ్బులతోనే విలాసాలు చేస్తున్నాడు. ఒక కొడుకు విశాఖలో ఉండగా మిగిలిన ఇద్దరు కొడుకులు కూతవేటు దూరంలో ఉన్నా అస్తి పస్తుల గురించి అడుగుతారే తప్ప వారి ఎలా ఉన్నారని పట్టించుకోవడమే మానేశారు. దీంతో అందరు ఉన్నా అనాధలుగా ఒంటరిగా జీవితం గడుపుతున్నారు.

అసలే దయనీయపరిస్థితుల్లో బతుకున్న వృద్ధదంపతులకు లాక్‌డౌన్‌తో వారికష్టాలను మరింత పెరిగాయి. తోడునీడగా జీవనం సాగిస్తున్నవారు. ఇరుగుపొరుగు వారు ఇచ్చే అన్నంతోనే బతుకువెళ్లదీస్తున్నారు. విశాఖలో ఉన్న కొడుకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా లాక్‌డౌన్‌ అడ్డంకిగా మారింది. రవాణ సౌకర్యం లేకపోవడంతో ధీనంగా గడుపుతున్నారు. ఎలాగైనా తమను బిడ్డ చెంతకు చేర్చాలని వేడుకుంటున్న తీరు స్ధానికలను కలిచివేస్తోంది.

వృద్ధదంపతుల అవస్ధలు చేస్తుంటే బాధగా ఉంటుందని స్ధానికులు చెబుతున్నారు. క‌ష్టప‌డి సంపాదించుకున్న ఆస్తి పాస్తులు ఉన్నా మూడు పూటలా భోజ‌నం లేక అల్లాడుతున్నారని వాపోతున్నారు. తల్లిదండ్రుల బాధ్యతను చూసుకునే కొడుకు విశాఖలో ఉన్నందున వారిని అక్కడికి పంపేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని స్ధానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories